Taliban: ముంబై, హైదరాబాద్ ఆఫ్ఘన్ కాన్సులేట్లు తిరిగి ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్ వెల్లడించింది.
ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం, భారతదేశంలోని కాన్సులేట్లు, మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని స్టానిక్‌జాయ్ పేర్కొన్నారు. నయూమీ అనే వ్యక్తి భారత్ లోని దౌత్య కార్యాలయాలు మూసివేయబడ్డాయని, సేవలు అందించడం లేదని చెప్పాడు, అతని వాదనలు తప్పని తాలిబాన్లు స్పష్టం చేశారు. నవంబర్ 23 నాటికి భారత్‌లో ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు ఎవరూ లేరని, ఆ దేశ ఎంబసీ నవంబర్ 25న తెలిపింది.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
Read Also: India at UN: ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా యూఎన్‌లో భారత్ ఓటు..
అయితే ఆ సమయంలో భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లోని పౌర ప్రభుత్వాన్ని దించేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ మానవతా సాయం కింద ఆఫ్ఘన్లకు మెడిసిన్స్, గోధుమలు వంటి వాటిని భారత్ పంపిస్తోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనే విషయంలో ఐక్యరాజ్యసమితి మార్గనిర్దేశాన్ని అనుసరిస్తామని భారత్ తెలిపింది.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!