తాలిబన్ల ఎంట్రీతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… దేశాన్ని వదిలి పరారయ్యాడు.. ఇక, అప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్.. చట్టాల ప్రకారం తానే అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్నాడు. మరోవైపు.. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి షాకిస్తూ.. వారి ఖాతాలను నిలిపివేస్తూ.. వారి కంటెంట్‌ను తొలగించేందుకు.. కొత్త కంటెంట్‌పై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక కొత్త టీమ్‌నే ఏర్పాటు చేసింది.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లోనూ వారి కంటెంట్‌పై బ్యాన్ విధించింది ఫేస్‌బుక్.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్‌కు షాకిచ్చింది ట్విట్టర్… ఆయనకు సంబంధించిన ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసింది. కాగా, తాలిబన్లకు తాను తలొగ్గేది లేదని, వారితో చివరివరకు పోరాటం చేస్తానని ప్రకటించాడు అమ్రుల్లా సాలేహ్.. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్ ఆయన ఖాతాను తొలగించడం చర్చగా మారింది. అయితే, తమ సంస్థ నిబంధనలను అతిక్రమించే ఖాతాలను తొలగిస్తున్నామని, అందులో భాగంగానే అమ్రుల్లా సాలేహ్ ఖాతాను కూడా తొలగించామని చెప్పుకొచ్చింది ట్విట్టర్.