బ్రిటన్ సంచలన ప్రకటన.. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రమంగా తాలిబన్లకు కూడా మద్దతు పెరుగుతుందా? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో.. ఎందుకంటే.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై మెజార్టీ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. కొన్ని దేశాలు వారికి కూడా మద్దతుగా మాట్లాడుతున్నాయి.. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనా.. తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటిస్తే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం వారికి మద్దతు పలికారు.. ఇక, రష్యా కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడింది.. తాజాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపేందుకు అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు.. ఆ మేరకు రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామన్నారు బోరిస్ జాక్సన్.. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు వస్తున్న ఆఫ్ఘన్ పౌరులతో కిక్కిరిసిన కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1,615 మందిని ఆఫ్ఘన్ నుంచి బ్రిటన్‌కు తరలించామని.. వీరిలో 399 మంది బ్రిటన్‌కు చెందినవారు కాగా.. 320 మంది రాయబార కార్యాలయ సిబ్బంది, 402 మంది ఆఫ్ఘన్ ఉన్నారని వివరించారు. ఓవైపు తాలిబన్ల చర్యలపై ఇంటి బయట వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.. బహిరంగంగా మహిళలు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. చాలా దేశాలు తాలిబన్ల పాలన గురించి ఊహించలేకపోతున్నారు.. ఈ తరుణంలో బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు చర్చగా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!