కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో హృదయ విదారక దృశ్యం: చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు కాబూల్ నగరంలోకి ఎంటరయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజలు ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లాలని, ఏ దేశం వెళ్లినా ఫర్యాలేదని చెప్పి ఆస్తులు వదిలేసుకొని ఎయిర్‌పోర్ట్ వైపు పరుగులు తీశారు. సోమవారం నుంచి ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తున్నారు. అయితే, సాయంత్రం సమయంలో తాలిబన్లు ఎయిర్‌పోర్ట్ వద్ద విధ్వంసం సృష్టిస్తుండటంతో తాము వెళ్లకపోయినా పర్వాలేదు, ఆఫ్ఘన్ తరువాత తరం వారినైనా రక్షించాలని ప్రజలు కోరుకొని చంటి బిడ్డలను ఎలాగైనా ఎయిర్‌పోర్డ్ కంచెను దాటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పది, పన్నెండేళ్ల చిన్నారుల నుంచి నెలల వయసున్న చిన్నారులను ఎయిర్‌పోర్ట్ కంచె దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వయసున్న పిల్లలను తల్లిదండ్రులు వదిలేసుకొని బతకడం అంటే కష్టమే. కానీ, తప్పని సరి పరిస్థితుల్లో చిన్నారులను స్వేచ్చగా బతకాలని, తాలిబన్‌ల చెర నుంచి రక్షించుకోవాలని మనసు చంపుకొని చిన్నారులను కంచె దాటించి అమెరికా ఆర్మీకి అందిస్తున్నారు. నెలలు వయసున్న ఓ చిన్నారిని ప్రజలు అమెరికన్ ఆర్మీకి అందిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఈ ఫొటోను చూసిన ప్రపంచం మొత్తం కంటతడి పెట్టుకుంటోంది. తాలిబన్ల నెత్తుటి క్రీడకు అభంశుభం తెలియని చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read: ఒకప్పుడు ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందిన వ్యక్తి…ఇప్పుడు తాలిబన్ అగ్రనేతగా మారాడా..!!
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Tags
- Afghanistan
- airport
- Kids
- Taliban
- US Army
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!