చెప్పింది ఒకటి.. చేసేది మరోటి.. తాలిబన్ల డోర్ టు డోర్ తనిఖీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లపై ఆది నుంచి అనుమానాలే.. వారు చెప్పేది ఒకటైతే.. చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఆఫ్ఘన్‌నిస్థాన్ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు.. ఇక యుద్ధం ముగిసిందని.. అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం.. మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి.. మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు.. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు.. అప్పడే.. డోర్‌డోర్ తనిఖీలు చేపట్టారు తాలిబన్లు… గతంలో నాటో దళాలకు పనిచేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. వారి కుటుంబసభ్యులను తాలిబన్లు బెరిస్తున్నట్లు యూఎన్ చెబుతోంది.. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.. వ్యక్తిగతంగా కొందరినీ తాలిబన్లు టార్గెట్ చేశారని.. ఆ బెదిరింపులు దానిని స్పష్టం చేస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో పేర్కొంది..
ఇక, అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న సమయంలో.. నాటో దళాలు కూడా తాలిబన్ల అరాచకాలను నిలువరించాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సహకరించిన వారి కోసం తాలిబన్లు అన్వేషిస్తున్నారు. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయమని, లేదంటే వాళ్లను పట్టుకుని విచారించి, వారి కుటుంసభ్యులను శిక్షిస్తామని తాలిబన్లు హెచ్చరిస్తున్నట్టు యూఎన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్‌లో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Tags
- Afghanistan
- NATO
- people
- Taliban
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!