ఇప్పుడు ప్రపంచం మొత్తం తాలిబన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. 1970 దశకం నుంచి మొజాహిదీన్లు ఆఫ్ఘన్‌లో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ తరువాత మొజాహిదీన్‌ల నుంచి తాలిబన్ సంస్థ ఆవిర్భవించింది. 1996లో తాలిబన్‌లు ఆఫ్ఘన్‌లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల వారి పాలనలో ఆ దేశంలోని ప్రజలు ఎన్ని నరకయాతనలు అనుభవించారో చెప్పాల్సిన అవసరం లేదు. 2001 తరువాత తాలిబన్లను యూఎస్ సైన్యం తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎప్పుడు మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. మరోసారి…
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్‌గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయింది. మహిళలకు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వారికి అవకాశం ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినా, భయాందోళనలు ఏ మాత్రం తొలగిపోలేదు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, కొంత మంది మహిళలు కాబూల్‌లో ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నిలబడి నిరసనలు తెలిపారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటి కాబూల్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా, మహిళలకు స్వేచ్చ కల్పించాలని,…
ఆఫ్ఘనిస్థాన్‌లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,…
ఏ మాత్రం బెరుకు లేకుండా క్రమంగా ముందుకు కదులుతూ.. తమ ఆకృత్యాలను కొనసాగిస్తూ మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్‌లోని ప్రధాన కార్యాలయాల్లోనూ పాగా వేశారు.. ఇక, ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్.. గతంలో తమ వైఖరికి, విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని…
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అసలు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్పష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భారతీయులు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్లడించింది.…
అఫ్గనిస్తాన్ సంపూర్ణంగా తాలిబన్ల వశమైంది. మరోసారి ప్రజలు స్వంత దేశంలో బందీలైపోయారు. ఆడవారు, పిల్లల పరిస్థితి అయితే మరింత దారుణం. బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి. కానీ, అఫ్గాన్ ఎప్పుడూ ఇలాగే ఉండేదా? కాదంటోంది సీనియర్ నటి హేమా మాలిని. కొన్ని దశాబ్దాల క్రితం ‘ధర్మాత్మా’ అనే సినిమా విడుదలైంది. అందులో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ ఓ గ్యాంగ్ స్టర్ గా, విలన్ గా నటించాడు. ఆ సినిమాలో హేమా మాలిని పాత్ర…
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు తాలిబన్ల పాలన కావటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ వార్త అయింది. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు సురక్షితంగా దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం తాలిబన్లు చేస్తున్న అరాచకాలు, వారు ఆడే ఆటలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. వరుసగా ట్వీట్ల మీద ట్వీట్ తో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని…