హైదరాబాద్ లో మరో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలోని పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'హరికథ'. ఈ సినిమాలోని 'పిల్లా నీ చేతి గాజులు....' అనే గీతాన్ని ప్రముఖ నటుడు ప్రియదర్శి ఆవిష్కరించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకున్నాయి. పార్టీలన్నీ మునుగోడులో తమ సత్తా చాటుకునేందుకు బాహాబాహీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులను మంత్రులు హరీష్ రావు, తలసాని పరీశీలించారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.