Harikatha: కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘హరికథ’. అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్య శాఖామంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విడుదల చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ‘హరికథ’లో ‘పిల్లా నీ చేతి గాజులు’ అనే గీతాన్ని తాజాగా నటుడు ప్రియదర్శి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న మా చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం” అని అన్నారు. ఈ సినిమాకు మహావీర్ స్వరాలు సమకూర్చగా, మస్తాన్ షరీఫ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.