Minister KTR: తెలంగాణ రాష్ట్రం నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.
తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం జరగడంతో.. భాగ్యనగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని వీఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.