Harish Rao: తెలంగాణకు కేంద్ర మంత్రులు వస్తారు.. ఒక్క రూపాయి సహాయం చేయకుండా వెళతారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులను మంత్రులు హరీష్ రావు, తలసాని పరీశీలించారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్ రావ్ మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాము సమాధానం చెప్పండి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత రంగం కార్మికులకు ఏం చేసింది? అని ప్రశ్నించారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలని మండిపడ్డారు. చేనేత రంగం మీద ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం హామీ ఇచ్చారు. ల్లగొండ జిల్లా బోధన్ పోచం పల్లి, సిరిసిల్ల ల్లో అనాడు ఆత్మ హత్యలకు పాల్పడిన కుటుంబాలకు యాబై లక్షలు అందించామని తెలిపారు.
చేనేత రంగం కార్మికులకు ప్రభుత్వం తరుపున అనేక రకాల చేయూతను ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి హరీష్ తెలిపారు. 350 కోట్లు రూపాయల నిధులతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ను చేనేత కార్మికులకు ఇచ్చామని గుర్తు చేసారు. నేతన్నలు భీమా, మరమగ్గాల కు సబ్సిడి లాంటి అవకాశాలు ఇస్తున్నామని అన్నారు మంత్రి.కొండ లక్ష్మన్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మాడల్ అని అన్నారు. అప్పటి పాలకులు కొండ లక్ష్మన్ బాపూజీ ని అవమానిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పించామని తెలిపారు. 1250 ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావ్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేతన్న కార్మికులకు ఇక్కడే బరోసా ఇచ్చామని గుర్తు చేశారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లుమ్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. 2014 లో తీసుకొచ్చిన త్రీఫ్ట్స్ ఫండ్ పథకం కూడా రద్దు చేసింది బీజేపీ అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులకు రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల మీద పరోక్షంగా భారం వేసింది. దీనివల్ల నూలు దొరకకుండా ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి హరీశ్ రావ్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి సహాయం చేయకుండ వెళతారని విమర్శించారు. మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కు ఒక్క రూపాయి సహాయం అందించదని మండిపడ్డారు.రద్దు లన్ని కేంద్రానికి వర్తిస్తే పద్దులు అన్ని రాష్ట్ర ప్రభుత్వనిది అని మంత్రి అన్నారు. కొండ లక్ష్మన్ బాపూజీ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. నేతన్న భీమా కింద ఐదు లక్షలు సహాయం అందిస్తున్నామని అన్నారు. ఎల్ ఐ సి,రైల్వే,రైల్వే స్టేషన్ లను అమ్మిన ఘనత మీది అని విమర్శించారు మంత్రి. మేకిన్ ఇండియా ఆంటీరి జాతీయ జెండాలను చైనా నుండి తెచ్చారని అన్నారు.ఎక్కడ మేకిన్ ఇండియా ఇదేనా మేకిన్ ఇండియా అంటే? అని ప్రశ్నించారు. వాళ్ళవి రద్దు మనవి పద్దు అన్నట్టు ఉందని అన్నారు.
GVL Narasimha Rao : విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారు..?