Telangana Sheep Distribution Scam : తెలంగాణలో అమలైన “గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం (SRDS)”లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002 కింద దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తులో పలువురు ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర బయటపడింది. ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం జూలై 30న నిర్వహించిన సోదాల్లో ముఖ్యంగా…
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును హడావిడిగా పాస్ చేసి కేంద్రానికి పంపారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్డినెన్స్‌తో ఏదో జరిగినట్లు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యి నోబెల్ బహుమతి వచ్చినట్లు ఫీల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అగస్ట్ 5, 6, 7 తేదీల్లో డ్రామాలు ఆడబోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని తాము డిమాండ్…
Talasani Srinivas Yadav slams Congress over BC Reservation: రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే అని గుర్తుచేశారు. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు?, ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారని ఎద్దేవా చేశారు. బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్…
పార్టీ మారిన వారి పరిస్థితి చూస్తున్నాం అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని, ఎవరు వార్త రాపించారో వాళ్లనే అడగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని, హైదరాబాద్ గ్రామాల్లో సర్వే ప్రాపర్‌గా జరుగలేదన్నారు. 60 లక్షల మంది ఎక్కడ పోయారో లెక్కలు లేవని తలసాని విమర్శించారు. ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండని, తమ మీద…
పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న…
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని…
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి.. ఎమ్మెల్యే సౌమ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే తంగిరాల…
Talasani Srinivas Yadav : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు అన్యాయం చేసేలా సర్వే రూపొందించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుషించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, దీనివల్ల అనేక మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్…
తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.