Kethireddy Pedda Reddy: 2024 ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చమెత్తుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను పాదయాత్ర చేస్తుంటే.. జేసీ కరపత్రాలు పంచుతున్నాడని మండిపడ్డారు.. జేసీ సోదరులకు సవాల్ విసురుతున్నాను… నా మీద, నా కుటుంబసభ్యుల మీద అక్రమ కేసులు పెడితే, దానికి మ్యూల్యం మీ ఇంటి నుంచి మొదలు అవుతుందని హెచ్చరించారు..…
అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్‌లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి…
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాదం నెలకొంది. తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.పట్టణంలోని విజయ నగర్ కాలనీకి చెందిన నాగయ్య అనే హమాలీ మొదటి కుమారుడు నవీన్ యాదవ్(21) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్నాడు. గత కొద్దిరోజులుగా నవీన్ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నవీన్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి నవీన్‌కి ఫోన్ చేసి మందలించాడు.…