ఆ ఒక్క మాట వారికి బాగా కలిసి వచ్చింది. అధికారం పోదన్న ధీమా వాళ్లను నేలమీద నిలబడ నివ్వడం లేదు. అధికారం చేజారిపోదన్న నమ్మకం అందుకు కారణమా? ఎవరా నాయకులు? ఏంటా రాజకీయం? లెట్స్ వాచ్! తాడిపత్రిలో గేర్ మార్చిన జేసీ! మున్సిపల్ ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మారింది. అసలే గరం గరంగా ఉండే ఇక్కడి పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఉప్పు…
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హీట్ పెంచుతోంది పొలిటికల్ ఫైట్… మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా మారింది పరిస్థితి… ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధమే నడుస్తుండగా.. తాజాగా.. మరో వివాదం చోటు చేసుకుంది.. ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇదే సమయంలో మున్సిపల్ అధికారులను, సిబ్బందిని తీసుకుని నగరంలో పర్యటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దీంతో.. అధికారులు,…
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు… అయితే, కేసులపై సీరియస్‌గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏవరిని రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారో తెలియదని కామెంట్ చేసిన ఆయన.. కేసు పెట్టిన విషయం కూడా…
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ…
తాడిపత్రి అర్జాస్ స్టీల్స్ వద్ద 500 బెడ్ల కోవిడ్ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కేవలం రెండు వారాల రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ను సిఎం జగన్ ఆదేశాలతో నిర్మించారు. ప్రతీ పేషెంట్ బెడ్ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు,…