ఎన్నికల సీజన్ వచ్చేస్తోంది. ప్రతి పార్టీ జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి పీపుల్స్ సర్వే చేపడుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికీ, గడప గడపకూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ మెగా మాస్ సర్వేకి అనూహ్య స్పందన లభించింది. ఇటు టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల దృష్టికి తెస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అంటూ సభలు పెడుతున్నారు. జగన్ స్టిక్కర్లను చూసి అదే తరహాలో ప్రచారానికి తెరతీశారు టీడీపీ నేతలు. అయితే అక్కడే రివర్స్ కొట్టింది వ్యవహారం. తాడిపత్రిలో జగన్ స్టిక్కర్ల తరహాలో టీడీపీ నేతలు స్టిక్కర్ల యుద్ధానికి దిగారు. అయితే వారికి స్థానికులు, ఇంటి యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు అంటించడంపై స్థానికుల నుంచి టీడీపీకి వ్యతిరేకత వచ్చింది. స్థానికులు ఆగ్రహించడంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పలేదు.
Read Also: Ambati Rambabu: టీడీపీ పుట్టుక నుంచి కాపు వ్యతిరేక పార్టీయే
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం పెద్దపేట గ్రామంలో టీడీపీ ఇంచార్జి జేసీ అశ్మిత్ రెడ్డి ‘ఇదేం కర్మ మన రాష్ట్రం కి’ ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్యాడర్ ఇంటి యజమానుల అనుమతి లేకుండా స్టిక్కర్‌ను అతికించడంతో ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు ఎవరిని అడిగి స్టిక్కర్లు అతికిస్తున్నారని యజమానులు మండిపడ్డారు. స్టిక్కర్లు అతికించవద్దని చెప్పినా జగన్ స్టిక్కర్ కింద అష్మిత్ రెడ్డి స్టిక్కర్ అతికించాడు టీడీపీ కార్యకర్త. దీంతో ఆగ్రహంతో టీడీపీ నేతలపై ఇంటి యజమానులు విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్త బలవంతంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే స్టిక్కర్‌ను తొలగించాల్సి వచ్చింది. తమ అనుమతి లేకుండా స్టిక్కర్లు ఎలా అతికిస్తారని, వెంటనే తీసేయాలని చెప్పడంతో టీడీపీ నేతలు ఆ స్టిక్కర్లు తీసేసి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు