అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. అందులోనూ తాడిపత్రిలో అయితే నువ్వా నేనా అనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్ది వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డీజే డ్యాన్స్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తనదైన రీతిలో స్పందించారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ …73 సంవత్సరాల వయసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి డిజె డాన్స్ అవసరమా …! అని ఎద్దేవా చేశారు. కొడుకు బర్త్ డే కి కార్యకర్తలతో కలిసి డాన్స్ చేస్తున్నాడు.. తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ అంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి డిజె డాన్స్ వేసుకునే స్థితికి వచ్చింది.
తిట్టే సంస్కృతి మారాలని దేవుని ప్రార్థిస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం. జేసీ ప్రభాకర్ రెడ్డి రేపటి నుంచి మీ ఇంట్లో బర్త్ డే ఫంక్షన్లు ఉంటే నన్ను పిలవండి… నేను డీజే డ్యాన్స్ చేస్తా అంటూ పిలిచినట్టు ఉందన్నారు పెద్దారెడ్డి. కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డ్యాన్స్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.