అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేపై హాట్ కామెంట్స్ చేశారు. పెడ్డపప్పూరు సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందాం రండి అంటూ ఎమ్మెల్యేకి జెసి పిలుపునిచ్చారు. ఇసుక దోపిడీపై సాక్ష్యాధారాలతో వివరించారు జేసీ. ఇసుక రీచ్ లో నిబంధనలు పాటించడం లేదు. రోజుకి 20 మంది తో 75 ట్రాక్టర్లు లేదా15 టిప్పర్లు మాత్రమే తరలించాలి.
Read Also: Annu Kapoor: మొన్న సావర్కర్, నిన్న గాంధీ, నేడు దీనదయాళ్ ఉపాధ్యాయ!
కూలీలకు 300 రోజులు పని కల్పించాలి. అందుకు విరుద్ధంగా ఐదు యంత్రాలతో రోజుకి రాత్రింబవళ్ళు 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లు లోడింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే మానిటరింగ్ కమిటీ ఏం చేస్తోంది. కలెక్టర్ సహా కమిటీ లో ఉన్న 13 మంది ఏం చేస్తున్నారు. ఆధారాలతో అక్రమాలు బయట పెట్టినా అధికారులు స్పందించరా….? అని ఆయన మండిపడ్డారు. ఇలాగే వదిలేస్తే… మా ప్రాంతం నాశనం అవుతుంది. ఒక్క మీటరు తీయాల్సిన ఇసుక అరు అడుగులకు పైగా తవ్వుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. రోజుకి లక్ష రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే దీనిపై వెంటనే స్పందించాలన్నారు.
Read Also: Akkineni Nagarjuna: ఈ లుక్ లో ఒక సినిమా పడితే మాస్టారూ…