తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి..
తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది అని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.. కానీ, హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
JC Prabhakar Reddy: రప్పా రప్పా అనే డైలాగ్ తాడిపత్రి పట్టణానికి పాకింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడు కేతిరెడ్డి.. అయితే, నాకు వైఎస్ఆర్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు.
ఎన్టీవీతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు.. పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఏడాది కాలంగా నియోజవర్గానికి దూరంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్లిన గంటలోపే పోలీసులు నన్ను పంపించేశారు..
Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
కాలం ఏదీ మర్చిపోదు.. మనం ఒకటిస్తే.. ఆ తర్వాత రెండు తీసుకోవాల్సి వస్తుంది.. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా తన ప్రత్యర్థి ఇంటి ముందు కొలతలు వేయించి భయపడితే.. ఇప్పుడు ఆయన మాజీ అయ్యాక సీన్ రివర్స్ అయింది. అప్పుడు ఆర్.అండ్.బి వాళ్లు సీన్ లోకి వస్తే.. ఇప్పుడు మున్సిపల్ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. మున్సిపల్ ఆక్రమించారని తేలితే గోడలు…
JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు..
హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు..
మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..