Kathireddy Pedda Reddy React on Supreme Court Verdict: వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా…
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దారెటు..? ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలీస్ ఆంక్షల కారణంగా... సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లలేరు. 14 నెలల నుంచి ఆయన టౌన్‌లోకి రాకుండా ఇటు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానంటూ తన సైన్యాన్ని సిద్ధం చేస్తారు జేసీ. నువ్వు అటు వైపు చూసినా... లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు పోలీసులు. దీంతో... సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా…
తనను తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. హైకోర్టు తీర్పు వల్లే 14 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను.. కానీ, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ... మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో.. ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు.. కూటమి సర్కార్‌లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతూనే ఉన్నాయి.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ ప్రెస్ మీట్‌లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు మరువ లేకుండా ఉన్నారని, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ప్యాక్షన్ చేస్తానని సవాలు విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు.
JC Prabhakar Reddy: రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోటాపోటీ కార్యక్రమాలకు తెలుగుదేశం- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి.