KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్ఫెక్ట్ పొజిషన్…
T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్‌లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం…
T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర…
T20 World Cup: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ మరోసారి పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్ టీ20 ప్రపంచకప్ మాథ్యూ హేడెన్‌ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతరులతో కలిసి మెంటార్ బాధ్యతలను హేడెన్ పోషించనున్నాడు. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో క్రికెటర్ అయిన హేడెన్.. బ్రిస్బేన్‌లో అక్టోబర్ 15న పాకిస్థాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో…
Ravindra Jadeja: ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజా ఉన్నట్టుండి గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్‌కే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతడు మ్యాచ్‌లో గాయపడకుండా కేవలం టీమ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే గాయపడినట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజీలో హాంకాంగ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత రిలాక్సేషన్ కోసం దుబాయ్‌లోని సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయబోయి జడేజా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అ…
Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్‌కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీయడంతో పాటు నిలకడగా 150 కి.మీల వేగంతో బంతులు వేయడంతో.. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు సైతం అతడ్ని తుది జట్టులో ఎంపిక చేయాల్సిందేనని సిఫార్సు చేస్తున్నారు. అయితే.. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ క్రీడా ఛానల్ చర్చలో భాగంగా ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ..…
గత మూడేళ్ల నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న దినేశ్ కార్తీక్.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్‌గా అవతరించి, జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దినేశ్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్ననారు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు. ‘‘ప్రస్తుతం…
టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం…
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్ఇండియాలో ఎంపికైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారాడు. ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఉమ్రాన్ మాలిక్‌కు మొదటి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ…