భారత జట్టుకు టీ20 కెప్టెన్‌ను నియమించే విషయంలో బీసీసీఐ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు, తదుపరి టీ 20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతుందని హైలైట్ చేస్తూ… రోహిత్ శర్మ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలనీ గవాస్కర్ అన్నారు. అయితే ప్రస్తుతం అజరుగుతున ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగియడంతో.. తాను ముందు చెప్పిన విధంగా టీ20 ఫార్మటు లో కెప్టెన్ గా…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ కు చేరాక పోవడం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని అన్నాడు. యూఏఈ లో ఉన్న తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్ లో టాస్కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఐపీఎల్ 2021 సీజన్, టీ20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఆటగాళ్లకు ఉంటే బాగుండేదన్నాడు.…
డేవిడ్ వార్నర్ ఎంటర్టైన్మెంట్కు ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉంటే ఎంత విజృంభిస్తాడో.. బయట అంత ఉల్లాసంగా కనిపిస్తాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. విండీతరపున ఆఖరి మ్యాచ్ ఆడిన బ్రావోకు రిటైర్మెంట్ వేళ గార్డ్ ఆఫ్ ఆనర్తో పాటు వార్నర్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు.…
భారత జట్టు నిన్న ఆడిన విధంగా అన్ని మ్యాచ్ లలో ఆడితే ఎవరు ఓడించి లేరు అని టీం ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నారు. అయితే కోహ్లీ సేన నిన్న స్కాట్లాండ్ పైన భావి ఓజయం సాధించిన విషయం తెలిసిందే. దీని పై జడేజా మాట్లాడుతూ… మా నెట్ రన్-రేట్ పెరగాలంటే మేము పెద్ద తేడాతో గెలవాలని అందరికీ తెలుసు.. అందుకే మేము మైదానంలో మా 100 శాతం అందించాలని చూసాము అని జడేజా అన్నారు.…
ప్రస్తుతం మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలకు సంబంధించిన పలు రికార్డుల గురించి మనకు తెలుసు. కానీ ధనాధన్ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారో మీకు తెలుసా? Read Also: దీపావళి అంటే చాలు.. రెచ్చిపోతున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20…
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్ లో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న బాబర్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మూడు అర్ధశతకాలు చేసిన ఏకైక కెప్టెన్ గా బాబర్ నిలిచాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడింది.…
మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు ఈ…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు గ్రూప్ బీ లోనే ఉన్న విసహాయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు గత ఆదివారం ఆడిన మ్యాచ్ లో భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే నిన్న న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ జట్టే విజయం సాధించింది. అయితే ఇలా అన్ని మ్యాచ్ లలో గెలిచి పాకిస్థాన్ జట్టు గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో…
టీ 20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో…
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా ఫ్రాక్చర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయగా న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ నుంచి అతడిని…