Aaron Finch: వార్మప్ మ్యాచ్‌లతో వరల్డ్‌కప్ గెలవలేం కదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaron Finch Comments On Warmup Match After Losing Against India: క్రికెట్‌లో ఓడడం, గెలవడం అనేది సహజం. గెలిచినంత మాత్రాన అహంకారం చూపించకూడదు, ఓడిపోతే విషం కక్కకూడదు. ఎందుకంటే, రోజులు అందరికీ ఒకేలా ఉండవు. ఈరోజు ఓడినవాడు రేపు గెలవచ్చు, గెలిచినవాడు ఓడిపోవచ్చు. ఏదేమైనా.. ప్రతీదీ యాక్సెప్ట్ చేయాలి. కానీ.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాత్రం ఓటమిని అంగీకరించలేక, భగభగ మండిపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే.. భారత్ విజయాన్ని చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు.
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఇవాళ వార్మప్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అయితే.. ఆరోన్ ఫించ్ మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేక విషం చిమ్మాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అతగాడు.. తొలుత తన ఇన్నింగ్స్ సంతృప్తినిచ్చిందని గట్టిగా డబ్బా కొట్టేసుకున్నాడు. 76 పరుగులు చేశాడు కదా! ఆ తర్వాత ఈ మ్యాచ్ తాము గెలిచి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే.. వార్మప్ మ్యాచ్‌లు ఆడి, వరల్డ్‌కప్ గెలవలేము కదా అంటూ పరోక్షంగా టీమిండియా విజయాన్ని చులకన చేశాడు. వార్మప్ మ్యాచ్‌లతో వరల్డ్‌కప్ గెలవలేమని చెప్పిన ఫించ్.. తాము గెలివాల్సిందని ఎందుకు అన్నాడు? ఇదే పాయింట్ పట్టుకొని నెట్టింట్లో అతడ్ని ట్రోల్ చేస్తున్నారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్థశతకాలతో చెలరేగడంతో, భారత్ అంత భారీ స్కోర్ చేయగలిగింది. 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఆసీస్.. మొదట్నుంచే విజృంభించింది. దాదాపు గెలుపుని తనవైపుకు తిప్పుకుంది. కానీ.. వారి ఆశలపై మహమ్మద్ షమీ నీళ్లు చల్లేశాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. షమీ కేవలం నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. మరొకటి రనౌట్ చేశాడు. దీంతో.. ఆరు పరుగల తేడాతో ఆస్ట్రేలియా ఓడింది. కెప్టెన్ ఫించ్ (76) ఒక్కడే అర్థశతకంతో మెరిశాడు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!