టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి, పసికూన జట్టు నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి మంచి జోరు మీదున్న టీమిండియాకు గట్టి పోటీ ఎదురైంది. రోహిత్ సేన ఆదివారం కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్‌లోని మిగతా జట్లలో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను టీమిండియా ఇవాళ ఢీకొంటోంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 భారీ స్కోరును చేసింది.