Danushka Gunathilaka Arrested In Harassement Case In Australia: టీ20 వరల్డ్‌కప్‌లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక కీలక ఆటగాడు దనుష్క గుణతిలక అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో గాయం అవ్వడంతో అతడు జట్టుకి దూరమయ్యాడు. ఇక ఈ టోర్నీలో సెమీస్‌లో చోటు దక్కకపోవడంతో శ్రీలంక జట్టు తిరుగు పయనమైంది. సరిగ్గా అదే సమయంలో తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే గుణతిలకను అరెస్ట్ చేశారు. దీంతో.. శ్రీలంక జట్టు ఆటగాళ్లు అతడ్ని ఆస్ట్రేలియాలోనే వదిలేసి, స్వదేశానికి బయలుదేరారు.
గుణతిలకపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓ అమ్మాయి అతనిపై అత్యాచార ఆరోపణలు చేసింది. స్వదేశం(శ్రీలంక)లోనే ఒక నార్వే అమ్మాయి.. గుణతిలకతో పాటు అతని స్నేహితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే.. గుణతిలక ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డాడు. జట్టులో కీలక ఆటగాడు కాబట్టి, అతడ్ని ఆ కేసు నుంచి కాపాడుకోగలిగారు. కానీ.. ఆస్ట్రేలియా వ్యవహారం మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాగా.. శ్రీలంక తరఫున గుణతిలక 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. వన్డేల్లో 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు.. టీ20ల్లో 3 హాఫ్ సెంచరీలతో ప్రామిసింగ్ బ్యాటర్‌గా గుణతిలక పేరు తెచ్చుకున్నాడు. కానీ.. ఈ అత్యాచార ఆరోపణలు మాత్రం గుణతిలక కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి.