టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్లో తొలి రౌండ్లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ను ఢీకొంటోంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్లో ఐదు మ్యాచ్లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్.