Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 రేపటి (సెప్టెంబర్ 9) నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఆసియాలోని 8 జట్లు పొట్టి ఫార్మాట్‌లో (T20I) తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో జరగనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశ, సూపర్ 4…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడే ఒక ట్వంటీ20 (T20) ఫ్రాంచైజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL). ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ లీగ్ ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక జాతీయ వేదికగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా వారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లేదా జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశం పొందవచ్చు. అయితే ఆసక్తికరంగా విజయవాడ సన్ షైనర్స్ అనే జట్టుని…
Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు.…
ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కొనసాగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాదు. కాబట్టి 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
LSG vs MI: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ హోరాహోరీ పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పరుగుల స్వల్ప తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నోలోని సొంత మైదానంలో జరిగిన ఈ ఉత్తేజకరమైన పోరులో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్, 20 ఓవర్లలో…
ఐపీఎల్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.