ఐపీఎల్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (48) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. తిలక్ వర్మ (39) పరుగులతో రాణించాడు. మరోసారి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (8) నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6) విఫలమయ్యాడు. హార్ధిక్ పాండ్యా (11) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. చివర్లో నమన్ ధీర్ (18), మిచెల్ శాంట్నర్ (18) పోరాడినా విజయం సాధించలేకపోయారు. దీంతో వరుసగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రస్ది్ద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రబాడ, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.
Nani : నాని సినిమా కోసం పాన్ ఇండియా హీరోయిన్..?
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. శుభ్‌మన్ గిల్ (38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు. చివర్లో షరీఫానే రూథర్‌ఫోర్డ్ 18 పరుగులు, రషీద్ ఖాన్ 6 పరుగులు చేశారు. గుజరాత్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. షారుఖ్ ఖాన్ (9), రషీద్ ఖాన్ (6), కగిసో రబాడా (7) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రహ్మాన్, సత్యనారాయణ రాజు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Swati Sachdeva: తల్లిపై జోకు వేయడంతో వివాదంలో స్టాండ్-అప్ కమెడియన్..