Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు.
ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీకి ఆడతాడో, ఆ ఫ్రాంచైజ్ అధికమొత్తంలో ఇచ్చి అతడిని కొనుగోలు చేస్తుంది. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. కానీ గత 2 ఏళ్ల నుండి మాక్స్వెల్ ,ఐపీఎల్ దారుణంగా విఫలమవుతున్నాడు. నమ్మి కొనుగోలు చేస్తున్న ఓనర్లను ముంచేస్తున్నాడు. గత 2 ఏళ్లుగా ఐపీఎల్ లో 17 మ్యాచులు ఆడాడు కానీ చేసినా పరుగులు 100.వీటితో పాటు 10 వికెట్లు తీసుకున్నాడు.ఇలా పేలవ ప్రదర్శన కనబరిచాడు
అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న MLC లీగ్లో మాక్స్వెల్ దుమ్మురేవుతున్నాడు. వాషింటన్ ఫ్రీడమ్ టీంకు కెప్టెన్ గా వున్నమాక్స్వెల్,ఆడిన 9 ఇన్నింగ్సుల్లో 185 స్ట్రైక్ రేట్ తో 237 పరుగులు చేసాడు.ఇక బౌలింగ్ కూడా 9 వికెట్లు పడగొట్టి,తన టీంని Play Offs కి చేర్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో సిక్సర్లతో విరుచుకుపడుతూన్నాడు. దీంతో ఈ ఆట అంతా ఐపీఎల్లో ఏమైంది అని ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Quantum Valley Declaration: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు