ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కొనసాగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాదు. కాబట్టి 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
READ MORE: Pooja Hegde : జాలి లాంటి చీరలో పూజాహెగ్డే అందాల ఫోజులు
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ 9.45కి ప్రారంభవుతుందని భావించినప్పటికీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పవర్‌ప్లే 4 ఓవర్లు ఉండనుంది. ముగ్గురు బౌలర్లకు మాత్రమే అత్యధికంగా తలో నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఒక బౌలర్ (నాలుగో బౌలర్) రెండు ఓవర్లు బౌలింగ్ వేయొచ్చు. కాగా.. సొంత గడ్డలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతుండగా.. లాస్ట్ మ్యాచులో 111 పరుగుల సల్ప లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించిన పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్లో చెరో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ, పంజాబ్.. నాలుగింట్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. పంజాబ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది.
READ MORE: Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..