మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు క్రమంగా మన ప్రవర్తనలో భాగమవుతాయి. ఇది మానసిక సమస్యకు సంకేతం కావచ్చని అర్థం చేసుకోలి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) కూడా అలాంటి ఒక మానసిక స్థితి. ఇది కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్ అని వైద్యులు చెబుతుంటారు. అంటే ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. ప్రతిదీ పద్ధతిగా సర్ది ఉండాలి. ఏది ఉండాల్సిన చోట అది ఉండాలి. ఇలాంటి చాలా రూల్స్ వీరికి ఉంటాయి. అలా లేకపోతే వీరు ఒక విధమైన…
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య.
పక్షవాతం అంటే శరీరంలో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం. ఇది మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో వచ్చిన సమస్యల వల్ల తలెత్తుతుంది. దీనివల్ల శరీరం ఒక్కసారిగా దెబ్బతింటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ఒక వైపు చేయి, కాలు, నోరు, కన్ను ప్రభావితమవుతాయి. ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్, లావుగా ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా పక్షవాతాన్ని నివారించవచ్చు. అయితే పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు…
'మంకీపాక్స్' ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మధ్య మరియు తూర్పు ఆఫ్రికా నుండి మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు భారతదేశానికి చేరువైంది. పాకిస్థాన్‌లో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యక్తిలో మొదటి కేసు కనుగొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది.…
కేరళలోని కోజికోడ్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా మరణించాడు. ఇది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత.. అమీబా మెదడుకు సోకింది. దీంతో బాలుడిని జూన్ 24న ఆసుపత్రిలో చేర్చారు, అయితే అతను చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత…
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది.
ప్రస్తుత మనిషి జీవన శైలిలో ప్రధాన సమస్యల్లో హై బ్లడ్ ప్రెజర్ ఒకటి. గత కొంత కాలంగా కొంతమంది చిన్న వయస్సు పిల్లలలో కూడా ఈ వ్యాధి కనపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఒకసారి అధిక రక్తపోటు లక్షణాలు ఏంటో చూద్దాం.. * ముఖ్యంగా చాలా మందికి తరచుగా వచ్చే తలనొప్పి అధిక రక్తపోటుకు ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఈ సమయంలో తలనొప్పి తలకు రెండు…
Cold in Summer: ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగతో వాతావరణంలో మార్పులు రావడం మొదలైంది.
ఓరల్ క్యాన్సర్ అనేది నోటికి సంబందించినది.. ఒక రకమైన తల మరియు మెడ క్యాన్సర్.. ఇది బుగ్గలు, చిగుళ్ళు, నోటి పైన, నాలుక లేదా పెదవుల యొక్క లైనింగ్‌లోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతుంది. తరచుగా.. ఒరోఫారింజియల్ క్యాన్సర్.. ఇది మృదువైన అంగిలి, గొంతు యొక్క ప్రక్క, వెనుక గోడలు, నాలుక యొక్క మూడవ భాగం మరియు టాన్సిల్స్‌ను ప్రభావితం చేస్తుంది.. ధూమపానం, మద్యపానం చెయ్యడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని…
మన శరీర అవయవాలలో ముఖ్యమైన దానిలో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా.. శరీరంలోని వ్యర్థ, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి అశ్రద్ధ తీసుకుంటారు. వాటిపట్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. కిడ్నీలు పాడైతే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది.