Amoeba: చిన్న పిల్లల మెదడును తినే అమీబా లక్షణాలు ఇవే.. నివారణ పద్దతులు ఏంటంటే..?
- కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి 14 ఏళ్ల బాలుడు మృతి
- బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమవనున్న అమీబా
- అమీబా సోకితే తీవ్రమైన తలనొప్పి.. జ్వరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కోజికోడ్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా మరణించాడు. ఇది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత.. అమీబా మెదడుకు సోకింది. దీంతో బాలుడిని జూన్ 24న ఆసుపత్రిలో చేర్చారు, అయితే అతను చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు నెలల్లో మొత్తం మూడు మరణాలు సంభవించాయి. అందువల్ల, ఈ ప్రాణాంతక మెదడు సంక్రమణ గురించి సమాచారాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి.. దానిని మనం ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
Kavitha: లిక్కర్ కేసులో మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి..?
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. నేగ్లేరియా ఫౌలెరి అనేది ఒక స్వేచ్ఛా జీవి అమీబా. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది వెచ్చని మంచినీటిలో నివసిస్తుంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థకు సోకడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడు కణజాలాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మెదడు సంక్రమణ సంభవిస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. కొన్నిసార్లు ఈ అమీబా మురికి స్విమ్మింగ్ పూల్స్ మొదలైన వాటిలో కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన రెండు నుంచి 15 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
అమీబా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన తలనొప్పి
తీవ్ర జ్వరం
వికారం
వాంతి
గట్టి మెడ
చూడటంలో ఇబ్బంది
గందరగోళం
సమతుల్యం చేయలేకపోవడం
కోమా
దీన్ని ఎలా నివారించాలి?
నోస్ ప్లగ్స్ లేకుండా వెచ్చని మంచినీటి చెరువుల్లోకి దిగొద్దు. ఆ నీళ్లకు బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకే అవకాశం ఉంటే దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ దిగిన తర్వాత.. ముక్కు శుభ్రం చేయడానికి నీటిని మరిగించి.. చల్లబరిచి ఆపై ఉపయోగించాలి. క్లోరినేటెడ్ స్విమ్మింగ్ ఫూల్స్ ను మాత్రమే ఉపయోగించాలి. ఈత కొట్టేటప్పుడు మీ నోటిని నీటి అడుగున ఉంచవద్దు. వేడి నీటి చెరువు లేదా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన తర్వాత.. మీకు తలనొప్పి లేదా జ్వరం ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!