మన శరీర అవయవాలలో ముఖ్యమైన దానిలో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా.. శరీరంలోని వ్యర్థ, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి అశ్రద్ధ తీసుకుంటారు. వాటిపట్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. కిడ్నీలు పాడైతే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే.. కిడ్నీ ఆరోగ్యంపై అందరికీ అవగాహన ఖచ్చితంగా ఉండాలి. కిడ్నీలు పాడవటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? కనిపించే లక్షణాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
Director Hari: సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
వాపు లక్షణాలు
శరీరంలో మూత్రపిండాలు పాడైతే పాదాలు, చీలమండలలో వాపు లక్షణాలు కనపడుతాయి. వెంటనే అలాంటి సమస్య ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించాలి. మూత్రపిండాల ఫిల్టర్ దెబ్బతిన్నప్పుడు రక్త కణాలు మూత్రంలోకి ప్రవహిస్తాయి. దీంతో మూత్రంలో రక్తం రావడం కనిపిస్తుంది. అలాంటప్పుడు మూత్రపిండాలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పడానికి సంకేతం కావచ్చు.
మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది
శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోవడం వలన మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. దీంతో ఆకలి లక్షణాలు కనపడవు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా రక్తం, పోషకాల పరిమాణం సమతుల్యంగా ఉండదు. అంతేకాకుండా.. చర్మంలో పొడి తనానికి, దురద ఏర్పడుతుంది. మూత్రపిండాలు పాడైతే వడపోత పనిచేయకపోవడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది.
వాంతులు అవడం
సామాన్యంగా కొంతమందిలో వాంతులు అవుతుంటాయి. తగ్గడం కోసం మందులు వేసుకుంటాం.. అలా తగ్గకపోతే మూత్రపిండాలు పాడయ్యాయి అనే సంకేతం అని చెప్పవచ్చు.
మూత్రంలో నురుగు రావడం
మూత్రపిండాలు పాడైతే మూత్రంలో నురుగు రావడం కనిపిస్తుంది. శరీరంలోని ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోయి ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యుడు దగ్గరికి వెళ్లి మూత్రపిండాల పరిస్థితిని తెలుసుకొని చికిత్స తీసుకోవాలి.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..