ప్రస్తుత మనిషి జీవన శైలిలో ప్రధాన సమస్యల్లో హై బ్లడ్ ప్రెజర్ ఒకటి. గత కొంత కాలంగా కొంతమంది చిన్న వయస్సు పిల్లలలో కూడా ఈ వ్యాధి కనపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఒకసారి అధిక రక్తపోటు లక్షణాలు ఏంటో చూద్దాం..
* ముఖ్యంగా చాలా మందికి తరచుగా వచ్చే తలనొప్పి అధిక రక్తపోటుకు ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఈ సమయంలో తలనొప్పి తలకు రెండు వైపులా వస్తుంది.
* అధిక రక్తపోటు కారణంగా ముఖ్యంగా కళ్ళలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. వీటి వల్ల అస్పష్టమైన దృష్టి, డబుల్ విజన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి దీని తీవ్రత వాళ్ళ ఒక్కోసారి కంటిలోని రెటీనాను దెబ్బతీస్తుంది. ఈ సమస్యని ” హైపర్టెన్సివ్ రెటినోపతి ” అంటారు.
* కొందరిలో అధిక రక్తపోటు కారణంగా ముక్కు నుంచి తరచూ రక్తస్రావం అవుతుంది. ముక్కులోని పలుచని రక్తనాళాలు తెబ్బతిని అందులోనుంచి తరచూ ముక్కు రక్తం కారడం జరుగుతుంది.
* అధిక రక్తపోటు వాళ్ళ ఒక్కోసారి గుండె పై ఒత్తిడి తెస్తుంది. దీనికి కారణం అధిక రక్తపోటు వల్ల గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోవడమే. కాబట్టి శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బ్బందులు ఏర్పడతాయి.
* రక్తపోటు లక్షణాలలో తీవ్రమైన అలసట అనేది ఒకటి. అధిక రక్తపోటు కారణంగా గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడం కష్టమవడం వల్ల మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషక సరఫరాలను తగ్గిస్తుంది.
* అరిథ్మియా కూడా అధిక రక్తపోటు యొక్క ఓ ప్రధాన లక్షణం. అసాధారణ గుండె కొట్టుకోవడం లాంటివి అధిక రక్తపోటు వల్ల సంభవిస్తాయి.
* అధిక రక్తపోటు కారణంగా ఒక్కోసారి మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే మాత్రం అసలు తేలిగ్గా తీసుకోవద్దు. ఎలాంటి ఆలస్యం చేయకుండా డాక్టర్లును సంప్రదించండి.