పక్షవాతం అంటే శరీరంలో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం. ఇది మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో వచ్చిన సమస్యల వల్ల తలెత్తుతుంది. దీనివల్ల శరీరం ఒక్కసారిగా దెబ్బతింటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ఒక వైపు చేయి, కాలు, నోరు, కన్ను ప్రభావితమవుతాయి. ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్, లావుగా ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా పక్షవాతాన్ని నివారించవచ్చు. అయితే పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవి ఏంటో చూద్దాం.
* పక్షవాతం ఉన్నవారికి లక్షణాలు ముందుగానే కనిపించే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్నిసార్లు చిన్న పక్షవాతం (TIA) లక్షణాలు ముందుగానే తెలుస్తాయి. అంటే మాట్లాడటంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, లేదా శరీరంలోని ఒక భాగం తాత్కాలికంగా బలహీనపడడం, తిమిరి పట్టినట్లుగా అవ్వడం వంటి చిన్న లక్షణాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితిని పక్షవాతానికి ముందస్తు సంకేతంగా పరిగణించాలి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
* ఈ పక్షవాతాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో బ్లాకులు ఏర్పడటం వల్ల పక్షవాతం సంభవిస్తుంది. నివేదికల ప్రకారం.. 85 శాతం పక్షవాతం కేసులు రక్తనాళాల బ్లాక్ వల్ల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
* సాదారణంగా పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలో ఒక వైపు మాత్రమే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అప్పుడు నడవడం, మాట్లాడడం, రాయడం, లేదా శరీరాన్ని కదలించడం కష్టమవుతుంది. కంటి చూపు తగ్గిపోవడం, లేదా శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా పనికిరాకపోవడం కూడా జరుగుతుంది.
* ఆ రోగంతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని జాగ్రతలు తీసుకొవాలి. రక్తపోటు, షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవడం. సరైన ఆహారం తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను విడిచిపెట్టడం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులు పాటించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
* కొంత మందికి కాళ్లు చేతులు ఉరికురికే తిమిరి పడుతూ ఉంటాయి. చాలా మంది దాని నిర్లక్ష్యం చేస్తారు. అది చిన్న సమస్య కాదు. ఇలాంటి లక్షణాలు మీలో ఏ మాత్రం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.