డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నట్లు అంచనా. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారిలో సగం మందికి దాని గురించి తెలియదు.
READ MORE: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం..
మీ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు, అది కొన్ని స్పష్టమైన లక్షణాలకు దారితీస్తుంది. లక్షణాలు నెమ్మదిగా కనిపించడం ప్రారంభిస్తాయి. దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించడం కొంచెం కష్టం. మధుమేహం యొక్క లక్షణాలలో సాంప్రదాయక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం), పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) ఉంటాయి. శరీరంలో కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో తిరిగి డెవోలప్ చేయడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోజ్ నిల్వలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.
READ MORE: Guntur SP: వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదంపై గుంటూరు ఎస్పీ రియాక్షన్ ఇదే..!
మూత్రపిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్ నిల్వలు పెరిగితే, ప్రాక్సిమల్ టుబ్యూల్ నుండి గ్లూకోస్ రీఅబ్సార్ప్షన్ సరిగా జరగదు, కొంత గ్లూకోజ్ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). ఆహారాన్ని శోషించడం ద్వారా పొందిన గ్లూకోజ్ శక్తిని ఉత్పత్తి చేయడానికి కణాలు ఉపయోగించనప్పుడు, వ్యక్తికి ఆకలిగా అనిపిస్తుంది. శక్తి లేకపోవడం వల్ల కలిగే విపరీతమైన ఆకలిని పాలీఫాగియా అంటారు. మధుమేహం ఉన్నవారికి ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఆకలి తగ్గదు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయి అంత ఎక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత కూడా వారు అలసిపోయి బలహీనంగా ఉంటారు. పాలీఫాగియాకు దారితీసే కొన్ని ఇతర పరిస్థితులు ఓవర్యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడిజం, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లేదా ఒత్తిడి.