చేతులు లేకుండా ఈత కొట్టడం అనేది అత్యంత ప్రావీణ్యం ఉన్న ఈతగాళ్ళు కూడా ఊహించలేరు. చేతికి సంకేళ్లు ధరించిఈది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంత చేసుకోవడం అంత సులువు కూడా కాదు. కానీ, ఈజిప్టుకు చెందిన ఓ ఈతగాడు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
Swimming: ప్రస్తుత కాలంలో ఆధునిక పోకడల కారణంగా 30 ఏళ్లు వచ్చేసరికి కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. 50 ఏళ్లు వచ్చేసరికే సొంత పనులు చేసుకోవడానికే ఆపసోపాలు పడుతున్నారు. కానీ 82 ఏళ్ల బామ్మ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో అదరగొడుతోంది. ఈ వయసులోనూ మూడు బంగారు పతకాలు సాధించి అందరి నోళ్లు మూయించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం నాడు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. 50 మీటర్ల…
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే…
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…
తమిళ హీరో మాధవన్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. తండ్రి సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటే… తనయుడు స్విమ్మింగ్ ద్వారా ఖ్యాతి సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌కు చిన్ననాటి నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో వేదాంత్ 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో త్వరలో ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నాడు.…
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో…