హైదరాబాద్ నగర వాసి బొబ్బా రవీందర్ రెడ్డి సరికొత్త రికార్డ్ సాధించారు. భారత్ సోలో పేరుతో కాశ్మీర్ టూ కన్యాకుమారి సైక్లింగ్ యాత్ర చేపట్టి విజయవంతంగా ముగించారు. 22రోజుల్లో యాత్ర పూర్తి చేసిన బొబ్బా రవీందర్ రెడ్డి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. మొత్తం 3700కిలో మీటర్ల దూరం సైకిల్ యాత్ర సాగిందని రవీందర్ రెడ్డి తెలిపారు. ఒంటరిగా 51ఏండ్ల వయస్సులో ఈ ఘనత సాదించిన మొదటి వ్యక్తిగా రికార్డులకెక్కారు. యువతలో చైతన్యం అవగాహన కోసమే ఈ యాత్ర చేపట్టానని రవీందర్ రెడ్డి తెలిపారు.
Read Also:New UK Currency: కింగ్ చార్లెస్ ఫోటోతో కొత్త యూకే కరెన్సీ నోట్లు
సెల్ ఫోన్, కంప్యూటర్ లకు అతుక్క పోయి అనారోగ్యం పాలవకూడదని ఈ యాత్ర చేపట్టానని రవీందర్ రెడ్డి వెల్లడించారు. దారిపొడవునా ఈ యాత్రకు అనూహ్యస్పందన లభించిందని తెలిపారు. గతంలో సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ లో పలు రికార్డ్ లు ఆయన సొంతం చేసుకున్నారు. SAVE NATION స్లోగన్ తో ఇంధనం, గ్యాస్ ఆదాచేయాలని సైక్లింగ్ యాత్రకు శ్రీకారం చుట్టానని రవీందర్ రెడ్డి తెలిపారు. గెయిల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా బొబ్బా రవీందర్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి స్పాన్సర్స్ లేకుండా సొంత ఖర్చుతో ఈ ఘనత సాధించారు రవీందర్ రెడ్డి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా వెరవక ఈ అరుదైన రికార్డుని స్వంతం చేసుకున్న రవీందర్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఆయన సైకిల్ పై రయ్యిమంటూ దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also:Allu Arjun: బన్నీని సొంత సినిమాల ఈవెంట్లకు వద్దంటున్న ఆర్మీ.. ఎందుకంటే?