తమిళ హీరో మాధవన్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. తండ్రి సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటే… తనయుడు స్విమ్మింగ్ ద్వారా ఖ్యాతి సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌కు చిన్ననాటి నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో వేదాంత్ 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో త్వరలో ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నాడు.
Read Also: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలనే డ్రీమ్ ఉంటుంది. వేదాంత్ కూడా దీనికి అతీతం కాదు. ఈ నేపథ్యంలో వచ్చే ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ లేకపోవడం అతడికి ప్రతికూలంగా మారింది. ముంబైలో ఉండే పెద్ద పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ కూడా కరోనా కారణంగా మూతపడ్డాయి.
దీంతో కుమారుడికి ట్రైనింగ్ ఇప్పించేందుకు మాధవన్ తన భార్య సరితతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉండటంతో వేదాంత్ ట్రైనింగ్‌కు అనుకూలంగా ఉంటుందని దుబాయ్ వచ్చినట్లు హీరో మాధవన్ వెల్లడించాడు. తన కుమారుడిని నటుడిగా మార్చడం తనకు ఇష్టం లేదని, జీవితంలో వేదాంత్ ఏం చేయాలనుకుంటే అది చేయిస్తామని స్పష్టం చేశాడు. ప్రస్తుతం వేదాంత్ ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లలో పతకాలు గెలుస్తున్నాడని.. త్వరలో భారత్ తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని పతకం సాధిస్తాడని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.