చేతులు లేకుండా ఈత కొట్టడం అనేది అత్యంత ప్రావీణ్యం ఉన్న ఈతగాళ్ళు కూడా ఊహించలేరు. చేతికి సంకేళ్లు ధరించి ఈది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంత చేసుకోవడం అంత సులువు కూడా కాదు. కానీ, ఈజిప్టుకు చెందిన ఓ ఈతగాడు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా 11 కిలో మీటర్లు ఈదుకుంటూ వెళ్లి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు.
Also Read:Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఈజిప్షియన్ స్విమ్మర్ షెహబ్ అల్లం 7.238 మైళ్ళు (11.649 కిమీ) హ్యాండ్‌కఫ్‌లు ధరించి చాలా దూరం ఈత కొట్టినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చేతికి సంకేళ్లు ధరించి దాదాపు ఆరు గంటల పాటు ఈదాడు. అరేబియా గల్ఫ్ యొక్క ఓపెన్ వాటర్‌లో జరిగింది. అక్కడ అతను ఈత కొట్టే మొత్తం వ్యవధిలో చేతికి సంకెళ్లు ధరించాడు. సహాయక పడవను తాకడానికి అనుమతించబడలేదు.
శిక్షణ సమయంలో తాను చేతికి సంకెళ్లు వేసుకున్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాను అని షెహబ్ తెలిపాడు. తాను నిశ్శబ్ద ప్రదేశాలలో ఈత కొట్టడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. రికార్డ్ బ్రేకింగ్ ఎలైట్‌లో ఉన్నాననే భావన తనకు సూపర్ హీరో అనే భావనను ఇస్తుంది పేర్కొన్నాడు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు రికార్డ్‌లలో తన స్థానాన్ని కొనసాగించేలా చేస్తుందన్నాడు. సర్టిఫికేట్‌ని చేతిలో పట్టుకునే వరకు నా లక్ష్యం పూర్తయిందని భావించలేకపోయాను అని అతను చెప్పాడు. ఇంతకు ముందు సాధించిన విజయాల కంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా ఉండటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పాడు.
Also Read: Delhi Metro Girl: “డోంట్ కేర్”.. బికినీలో మెట్రో ప్రయాణంపై యువతి ఏం చెప్పిందంటే..
ఆరు గంటల పాటు సాగే ఈ స్విమ్ ద్వారా షెహబ్ గొప్పతనం కోసం పాటుపడేలా ఎందరికో స్ఫూర్తినిస్తుందని రికార్డ్ కీపింగ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. రాబోయే కాలంలో షెహబ్ సాధించిన చరిత్రను గుర్తించుకుంటారని తెలిపింది. మానవ సామర్థ్యానికి, మానవ ఆత్మ శక్తికి షెషబ్ సాధించిన విజయాలే ఉదాహరణ అని పేర్కొంది.