వికారాబాద్ జిల్లా యాలాలా మండలం అగ్గనూరు జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన మైనర్ బాలిక పై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. లైంగిక దాడికి పాల్పడిన రఘుపతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Srilanka Board: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అత్యాచార ఆరోపణల కారణంగా ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన గుణతిలక ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ మేరకు అతడు అరెస్ట్ కావడంతో ధనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.…
ఓ విద్యార్థి తనతో పాటు స్కూల్ కు సెల్‌ఫోన్ తెచ్చుకోవడంతో.. ప్రిన్సిపల్ తనను సస్పెండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అనుకున్నాడో.. లేక విద్యార్థుల ముందు అవమానంగా భావించాడో తెలియదు.. మనస్తాపానికి గురైన ఆ స్టూడెంట్ చిరకు తనువు చాలించాడు.
భూఆక్రమణలు,వసూళ్ళకు పాల్పడితే, టిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులను పార్టీనుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై వాఖ్యలు చేశారు. మున్సిపాలిటీకి చెందిన పది శా తం, మరికొన్ని స్థలాలు, గాంధీ ట్రస్టు భూమి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ ట్రస్టు సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పాటైందని,…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై టీఆర్‌ఎస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవేంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.ఇటీవల పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యను పంపించాలని వనమా రాఘవ కోరాడని.. అతన్ని వదిలిపెట్టవద్దని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ…
సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో ఎస్సై షఫీని, తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మహిళ భర్త ప్లాన్‌కు అతడి స్నేహితులు కూడా సహకరించారు.…
హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎస్సై బీ.సైదులును సస్పెండ్ చేసినట్లు రాచకొండి కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పలు కేసుల విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తేలడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలీసులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పు చేస్తే ఎవ్వరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్‌సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ఈ యువ పేసర్ గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్స్ వివాదం రేపాయి. 2012 నుంచి 2014 మధ్యలో ట్విటర్‌లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు…
ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను లీగ్ నుండి వెళ్లిపోయేవాడిని అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ … ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న…
ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుగురు ప్లేయర్లు, కోచ్ లు కరోనా బారిన పడ్డారు. అటు ఇవాళ సన్ రిజర్స్ ఆటగాడు వృద్ధమన్ సాహాకు కూడా కరోనా సోకింది. ఇది ఇలా ఉండగా ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నిన్న జరగాల్సిన కేకేఆర్,…