Ranga Reddy విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడి పై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల ఫిజిక్స్ టీచర్ వేణు గోపాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. వేణుగోపాల్ అసభ్య ప్రవర్తన రోజు రోజు మితి మీరడంతో సహించలేని బాధిత విద్యార్థినులు చివరకు మహిళా ఉపాధ్యాయులకు చెప్పారు. దీని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయురాలు వేణుగోపాల్ ను నిలదీసి వార్నింగ్ ఇచ్చారు. అయినా వేణుగోపాల్ తీరు మారలేదు. విద్యార్థినిలపైనే కాకుండా.. నిలదీసిన తోటి మహిళా ఉపాద్యాయుల పైనా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళా ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ చివరకు డీఈవో వద్దకు వెళ్లారు. వేణుగోపాల్ తీరుపై డీఈవో కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతున్నా ఎందుకు తమ వద్దకు తీసుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన జిల్లా విద్యా శాఖ అధికారి.. ఉపాధ్యాయుడు వేణుగోపాల్ ను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉతర్వులు జారీ చేశారు. విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా సరే విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయుల పట్ల వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
BRS KTR: ఢిల్లీ పర్యటనలో కేటీఆర్.. అసలు విషయం ఇదేనా..