First Ball SIX In T20I: సాధారణంగా ఏ ఒక్క క్రీడాకారుడికైనా తన దేశం తరఫున ఆడడానికి కష్టపడతాడు. అలా దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే అంత ఆషామాష విషయం కాదు. ఎంతోమంది ట్యాలెంటెడ్ ప్లేయర్లను అధిగమించి వారి ట్యాలెంటును నిరూపించుకొని నేషనల్ టీంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా స్థానం సంపాదించుకున్న తర్వాత వారు ఆడిన మొదటి గేమునే విజయం తీరాలవైపున నడిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటిది మరి భారతదేశం లాంటి దేశాలలో ఎంతో…
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో…
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన కొడుకు పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. సంజూ నైపుణ్యాన్ని గుర్తించి జట్టులో అవకాశం ఇచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని, కొందరు స్వార్థం కోసం ఆడుతారని చెప్పుకొచ్చారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి…
ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పైనే ఉంది. ట్రోఫీ జరుగుతుందా?, జరిగితే వేదిక ఎక్కడ? అని చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా.. పాక్‌కు భారత జట్టును పంపబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్లో జరపాలని పీసీబీని ఐసీసీ కోరింది. హైబ్రిడ్ విధానంలో…
టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో తమ కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఓ దశలో గెలిచేలా కనిపించినా.. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదన్నాడు. మూడో టీ20 జరిగే జోహెన్నెస్ బర్గ్‌లో మరింత ఎంటర్టైర్మెంట్ ఖాయం అని సూర్య చెప్పాడు. ఆదివారం గెబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల…
మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9…
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడుతున్న టీమ్ ఇండియా స్కోరు బోర్డుపై 202 పరుగులు చేయగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 141 పరుగులకే ఆలౌట్ అయింది.
India vs Bangladesh 3rd T20: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అయింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దసర పండగ రోజు విజయాల జోరు కొనసాగించేందుకు టీమిండియా కుర్రాళ్లు సై అంటున్నారు.
Suryakumar Yadav React on Bowling Options in Field: మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా తనకు పెద్ద తలనొప్పి అయ్యిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే జట్టులో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదన్నాడు. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతోనే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించామని చెప్పాడు. ప్రతీ మ్యాచ్‌లో మెరుగుపర్చుకోవడానికి ఏదో ఒక అంశం ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి…
Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి…