Suryakumar Yadav: సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్
- సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.
- కోలుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా జర్మనీ లోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ పోస్ట్ లో కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నానని.. సర్జరీ సాఫీగా జరిగిందని, త్వరగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అలాగే తిరిగి మైదానంలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చాడు.
Read Also:Prithvi Shaw: వారి వల్లే నా కెరియర్ దెబ్బ తినింది.. పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు.!
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ఆగస్టు 4 వరకు సాగనుంది. సూర్యకు విశ్రాంతి కావాల్సిన అవసరం ఉండటంతో, తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకునేందుకు ఈ సమయం (దాదాపు 40 రోజుల సమయం) ఉండడంతో ఈ సర్జరీ చేయించుకున్నాడు. ఆగస్టు 26న మొదలయ్యే బంగ్లాదేశ్ టూర్ లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి టీ20 జట్టుకు కెప్టెన్‌గా మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆయన వన్డేల్లో ఆడలేదు.
Read Also:Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!
ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ మంచి ప్రదర్శన కనపరిచాడు. ఐపీఎల్ సీజన్ లో 717 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగుల రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ లో వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25 పైగా పరుగులు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్ దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు టీ20 ఫార్మాట్ కు గుడ్‌బై చెప్పగా.. సూర్యకుమార్ కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. అప్పటి నుండి ఆయన నాయకత్వంలో జట్టు కొత్తగా, బలంగా కనపడుతోంది.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!