Ambati Rayudu Reveals Boundary Rope Mystery Behind Suryakumar Yadav’s Catch: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 పరుగుల తేడాతో ఓడించి.. రెండోసారి పొట్టి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతిపెద్ద మలుపు ఏంటంటే.. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో పెట్టడమే. సూర్య పట్టిన క్యాచ్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అయితే ఆ క్యాచ్ అప్పట్లో వివాదానికి దారితీసింది. బౌండరీ రోప్ వెనక్కి జరిగిందని కొందరు ఆరోపించారు. తాజాగా సూర్య పట్టిన క్యాచ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బౌండరీ రోప్ వెనక్కి జరిపారని స్పష్టం చేశారు. ఫైనల్ మ్యాచ్‌కు రాయుడు కామెంటేటర్‌గా వ్యవహరించారు.
తాజాగా ‘అన్‌ఫిల్టర్డ్’ పాడ్‌కాస్ట్‌లో అంబటి రాయుడు మాట్లాడుతూ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ వెనుక ఉన్న మిస్టరీని వెల్లడించారు. ‘వరల్డ్ ఫీడ్ వ్యాఖ్యాతల సౌకర్యం కోసం ఫైనల్ మ్యాచ్ విరామ సమయంలో బౌండరీ రోప్‌ను వెనక్కి జరిపి.. కుర్చీ, స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా జరిగేదే. మ్యాచ్ మొదలయ్యాక సిబ్బంది కుర్చీ, స్క్రీన్‌ను తీశారు. కానీ రోప్‌ను యధావిధిగా సెట్ చేయడం మర్చిపోయారు. దాంతో బౌండరీ కాస్త పెద్దదిగా మారింది. మేము (వ్యాఖ్యాతలు) ఈ విషయాన్ని కామెంట్రీ బాక్స్ నుంచి గమనించాం. ఇది దేవుడి ప్లాన్ అనుకున్నాం’ అని రాయుడు చెప్పారు.
Also Read: Ambati Rayudu: ఆ విషయంలో విరాట్ కోహ్లీ తోపు.. కానీ తొందరపడ్డాడు!
‘బ్రాడ్‌కాస్టర్ పరోక్షంగా సూర్యకుమార్ యాదవ్‌కు సహాయం చేశాడు. బౌండరీ రోప్ జరపకుండా ఉంటే సూర్య పట్టిన క్యాచ్ సిక్స్ అయ్యేదా అంటే చెప్పలేను. అతడు ఇంకాస్త ముందు నుంచి క్యాచ్ పట్టేవాడు కావొచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను, అది స్పష్టమైన క్యాచ్. ఆరోజు ముగింపులో దేవుడు మనవైపు ఉన్నాడు’ అని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచి సరిగ్గా ఏడాది తర్వాత రాయుడు అసలు విషయం చెప్పారు. దాంతో సూర్య క్యాచ్‌పై ఉన్న మిస్టరీ వీడినట్లే.
Since Rayudu is crying so much, let’s rewatch this beautiful catch taken by Suryakumar Yadav.
– Also look at that priceless reaction of Rohit bhai 😭❤️.
pic.twitter.com/lHGurOuwx7— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) August 18, 2025