Predicted India Squad for Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నేడు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది. ఆసియా కప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు. దాంతో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. మూడో ఓపెనర్‌గా జైస్వాల్ ఎంపికయ్యే అవకాశముంది. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆడుతారు. రింకు సింగ్ జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారించిన శ్రేయస్ అయ్యర్ జట్టులో స్థానానికి పోటీ పడుతున్నాడు. కానీ శ్రేయస్ ఇంకొంతకాలం నిరీక్షించక తప్పదేమో. ఆల్‌రౌండర్‌లుగా శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్‌లు ఎంపికవుతారు. రెండో కీపర్‌గా జితేశ్ శర్మ జట్టులోకి రావొచ్చు.
కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం లాంఛనమే. ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ జట్టుకు ఎంపిక కానున్నారు. తుది జట్టులో మాత్రం బుమ్రాతో పాటు ఒక్కరే ఆడనున్నారు. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అవసరం అయితే శివమ్ దూబె కూడా బౌలింగ్ చేస్తాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు కష్టమే. వరుణ్ చక్రవర్తి స్పెసలిస్ట్ స్పిన్నర్‌గా ఉంటాడు. చక్రవర్తితో పాటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు స్పిన్ భారాన్ని పంచుకోవచ్చు. ఈరోజు భారత జట్టుపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: Horoscope Today: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారు నేడు జాగ్రత్త సుమీ!
భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యశస్వి జైస్వాల్.