Mumbai Indians Won The Match Against Punjab Kings: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఛేధించింది. 18.5 ఓవర్లలోనే 216 పరుగులు చేసి, 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇషాన్ కిషన్ (75), సూర్యకుమార్ యాదవ్ (66) ఊచకోత కోయడంతో.. ఇంత భారీ లక్ష్యాన్ని ముంబై ఛేధించగలిగింది. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ.. విన్నింగ్ షాట్ కొట్టి, జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు.
Heroines: ఓ.. డైరెక్టర్స్..విప్పి చూపిస్తున్నా.. ఈ భామలను అసలు పట్టించుకోరేం

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టన్ (42 బంతుల్లో 82), జితేశ్ శర్మ (49) ముంబై బౌలర్లపై దండయాత్ర చేయడంతో.. పంజాబ్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి గెలుపొందింది. లక్ష్య ఛేధనలో భాగంగా ముంబైకి ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. ముంబై ఇంత భారీ స్కోరుని ఛేధించగలుగుతుందా? అనే అనుమానం రేకెత్తింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన గ్రీన్, ఇషాన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం జోడించాక, ఆ అనుమానాలకు చెక్ పడింది.
Pakkalapati Chandrasekhar: న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్.. అడ్డంగా బుక్కైన మేనేజర్
గ్రీన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. తన 360 డిగ్రీ ఆటతో పరుగుల వర్షం కురిపించాడు. ఎడాపెడా షాట్లతో పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నువ్వేనా? నేనూ కొడతానంటూ ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోయాడు. వీళ్లిద్దరు క్రీజులో ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించారు. మూడో వికెట్‌కి ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. వీళ్లిద్దరు వెనువెంటనే ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, టిమ్ డేవిడ్‌లు కలిసి మ్యాచ్‌ని ముగించారు. ముఖ్యంగా.. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. వేగంగా మ్యాచ్ ముగించేశాడు.