Mumbai Indians Scored 91 In First 10 Overs: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు పోరాడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. ముంబైకి మరో 10 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం పెద్దదే కానీ.. దూకుడుగా ఆడితే, ఛేధించే ఆస్కారం ఉంది. ఇంకా తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి.. ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడాలి.
Pakkalapati Chandrasekhar: న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్.. అడ్డంగా బుక్కైన మేనేజర్

లక్ష్య ఛేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై జట్టుకి మొదట్లో పెద్ద ఝలక్ తగిలింది. సున్నా పరుగులకే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెమరాన్ గ్రీన్‌తో కలిసి ఇషాన్ కిషన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 54 పరుగులు చేశారు. పవర్ ప్లేలో వీలైనంత పరుగులు రాబట్టడం కోసం.. వీళ్లిద్దరు సాయశక్తులా ప్రయత్నించారు. ముఖ్యంగా.. గ్రీన్ అయితే క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ షాట్లు కొట్టడానికి ట్రై చేశాడు. కానీ.. చాలా షాట్స్ మిస్ అయ్యాయి. ఈ క్రమంలోనే అతడు నథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఒక షాట్ కొట్టబోగా.. బౌండరీ లైన్‌లో రాహుల్ చాహర్ క్యాచ్ పట్టాడు. దీంతో.. అతడు పెవిలియన్ చేరాడు.
Chiranjeevi: పెంచు.. పెంచు.. హైప్ పెంచు.. చచ్చిపోవాలా జనాలు
ఈ సీజన్‌లో పెద్దగా రాణించని ఇషాన్ కిషన్, ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నాడు. గ్రీన్ ఔటయ్యాక వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న వీళ్లిద్దరు.. ఎక్కడిదాకా లాక్కొస్తారో చూడాలి. లక్ష్యం పెద్దదిగా ఉంది కాబట్టి.. ముంబైకి ఇది కత్తి మీద సాము వంటిదే.