తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. సన్…
కోవిడ్, లాక్డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం…
నిన్న ఎంతో ఆశతో ఎదురు చూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య కోర్ట్ డ్రామా “జై భీమ్” ఆస్కార్ 2022 లో పాల్గొనలేకపోయింది. సూర్య అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, ‘జై భీమ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో…
ముందుగా అనుకున్నట్టుగానే కరోనా మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ తప్పేలా కన్పించటం లేదు. మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే అవుననే అన్పిస్తోంది. ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య OTT సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “ఎతర్క్కుం తునింధవన్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్…
ప్రస్తుతం తన ఆస్కార్ ఫీచర్ చిత్రం ‘జై భీమ్’ భారీ విజయంతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2022లో అద్భుతమైన లైనప్ ఉంది. సూర్య తాజాగా మాట్లాడుతూ తన ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించారు. త్వరలో రజనీకాంత్ ‘అన్నాత్తే’ ఫేమ్ దర్శకుడు శివ, ‘సూరారై పొట్రు’ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి నెక్స్ట్ సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సూర్య స్వయంగా ఈ…
విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం “జై భీమ్” మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సూర్య నటించిన రియలిస్టిక్ మూవీ ఇటీవలే ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యింది. అలాగే కొద్ది రోజుల క్రితం 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సక్సెస్ ఫుల్ మూవీకి ఫిలిం నోయిడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో 3 బెస్ట్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ…
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా…
ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “జై భీమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కులం లాంటి సీరియస్ సబ్జెక్ట్ తో, అణగారిన వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి అన్బుమణి రాందాస్. “జై భీమ్” సినిమాపై రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ సూర్య తాజాగా సమాధానమిచ్చారు. నవంబర్ 11న సూర్య తన ట్విట్టర్ ఖాతా నుంచి రాందాస్…