Jai Bhim : సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ… ‘జై భీమ్’కు ఆస్కార్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఎంతో ఆశతో ఎదురు చూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య కోర్ట్ డ్రామా “జై భీమ్” ఆస్కార్ 2022 లో పాల్గొనలేకపోయింది. సూర్య అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, ‘జై భీమ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.
Read Also : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
నిన్న రాత్రి 7 గంటలకు ‘జై భీమ్’ గురించి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందనే ఆశతో, ఆ వార్తను చూడటానికి యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఉత్సాహంతో, ఉత్కంఠతతో ఎదురు చూసింది. అయితే దురదృష్టవశాత్తు ‘జై భీమ్’ ఆస్కార్ అవార్డుల నుండి ఔట్ అని ప్రకటించారు. కానీ సూర్య అభిమానులు మాత్రం సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 2న విడుదలైన గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఎంపికైంది. 94వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో మొత్తం 276 సినిమాలు పోటీ పడ్డాయి. వీరిలో 10 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. మొత్తం 23 కేటగిరీలలోని నామినేషన్లను ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నిన్న ప్రకటించారు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!