కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం సూర్య- బాలా ల మధ్య విభేదాలు చోటుచేసుకోవడమేనని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సూర్య- బాలా కాంబో ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కోలీవుడ్ లో సూర్యను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా నంద.. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బాలానే.. ఇక ఈ సినిమా తరువాత శివపుత్రుడు చిత్రంలో సూర్యకు ప్రత్యేక పాత్రను ఇచ్చి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కు అవార్డును అందుకునేలా చేశాడు. ఈ రెండు సినిమాల తరువాత సూర్య- బాలా చేస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు అభిమానులు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణాల వలన స్క్రిప్ట్ కూడా సరిగా సెట్ కాకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారట మేకర్స్.. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.