విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ – ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం విదితమే.. వీరికి సంబంధించిన లుక్ ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు .. అమర్ గా ఫహద్ కనిపిస్తుండగా.. సంతానంగా విజయ్ అలరించనున్నాడు.
ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య ఒక క్యామియో రోల్ లో నటిస్తున్న విషయం విదితమే.. అయితే క్యామియో రోల్ అంటే చివర్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. ఈ పాత్రలకు ప్రత్యేకంగా క్యాస్టూమ్స్, లుక్ ఉండవు.. కానీ విక్రమ్ లో సూర్య పాత్ర కొద్దిగా సర్ ప్రైజింగ్ గా ఉంది. తాజాగా సూర్య ఫస్ట్ లుక్ నుం మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో సూర్య రగ్గడ్ లుక్ లో కనిపించాడు.. చెవికి పోగు.. గరుకైన జుట్టు తో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మరి లోకేష్, సూర్య పాత్రను ఎలా డిజైన్ చేసాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యను ఈ రేంజ్ లుక్ లో ఉహించలేదే అని అభిమానులు షాక్ అవుతున్నారు. మరిఎన్నో ఏళ్ళ తరువాత రిలీజ్ అవుతున్న కమల్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.